: ఏపీ మాకు పెద్దన్నయ్య... హోదా ఇవ్వాల్సిందే: తెలంగాణ డిప్యూటీ సీఎం
ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు పెద్దన్నయ్య వంటిదని, ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా ఏఎస్ పేటలోని ఖాజా నాయబ్ రసూల్ దర్గాను కుటుంబసభ్యులతో సహా దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ దర్గాను సందర్శించిన ప్రతిసారీ తనకు మంచి జరిగిందని అన్నారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనించాలని ప్రార్థించినట్టు తెలిపారు. ఏపీతో పాటు తెలంగాణకూ ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి ఏఎస్ పేట దర్గా అభివృద్ధికి కొన్ని నిధులను మంజూరు చేయిస్తామని వివరించారు. దర్గా వద్ద మహమూద్ అలీకి, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.