: ఆ వార్తల్లో నిజం లేదు!... ట్విట్టర్ లో బీజేపీ నేత రాంమాధవ్


ప్రస్తుతం రాజ్యసభలో ఖాళీ కానున్న స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఏపీ కోటాలో నాలుగు సీట్లున్నాయి. వీటిలో ఓ సీటును అధికార టీడీపీ... తన మిత్రపక్షం బీజేపీకి కేటాయించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే టీడీపీ కోటాలోనే మొన్నటిదాకా ఎంపీగా ఉన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కర్ణాటక కోటా నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక ఏపీకి చెందిన మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును రాజస్థాన్ నుంచి బరిలోకి దింపుతున్నట్లు బీజేపీ నిన్ననే ప్రకటించింది. ఇక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)లో కీలక నేతగా ఎదిగిన ఏపీకి చెందిన రాంమాధవ్... ఏడాదిన్నర క్రితమే బీజేపీ నేతగా మారిపోయిన సంగతి తెలిసిందే. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో రాంమాధవ్ సత్తా చాటుతున్నారు. దీంతో ఆయనను రాజ్యసభకు పంపాలని బీజేపీ దాదాపుగా నిర్ణయించింది. ఈ క్రమంలో రాంమాధవ్ ను ఆయన సొంత రాష్ట్రం ఏపీ కోటా నుంచి పెద్దల సభకు పంపాలన్న బీజేపీ ప్రతిపాదనకు టీడీపీ కూడా సరేనన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న రాంమాధవ్ నేటి ఉదయం ట్విట్టర్ లో ప్రత్యక్షమయ్యారు. ఏపీ కోటాలో నుంచి తాను రాజ్యసభ బరిలోకి దిగుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తమని ఆయన ట్వీటారు.

  • Loading...

More Telugu News