: గతంలో మహానాడులు ముగిసే సరికి ఎనర్జీ డౌన్ అయ్యేది, ఇప్పుడు మాత్రం పెరిగిపోయింది!: చంద్రబాబు


గతంలో జరిగిన చాలా 'మహానాడు'ల ముగింపు సమయానికి ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోయేవని, ఈసారి మహానాడులో మాత్రం ఎనర్జీ బాగా పెరిగిపోయే పరిస్థితి వచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ‘ఇది కావాల్సిన స్పిరిట్. మన నాయకుడు ఇచ్చిన ఆత్మ గౌరవం.. నేను ఇచ్చింది ఆత్మ విశ్వాసం.. ఈ రెండు కలుపుకుంటే తెలుగు జాతికి తిరుగులేని విజయముంటుంది. విజయాల పరంపర మనదే తప్ప, వేరే వాళ్లది కాదు. నా ప్రాణ సమాన కుటుంబ సభ్యులందరికీ, నా మీద నమ్మకం పెట్టుకున్న, అభిమానం చూపెడుతున్న మీకందరికీ మరొక్కసారి పాదాభివందనం చేస్తున్నాను. ఆ నమ్మకాన్ని ముందుకు తీసుకుపోదాము. అనుకున్నది సాధిద్దాం. సాధించి ఒక చరిత్ర సృష్టిద్దామని కోరుకుంటున్నాను’ అని మహానాడు ముగింపు సందేశంలో చంద్రబాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News