: నా ట్రైలర్ చూసి మెగాస్టార్ చిరంజీవి పడిపడి నవ్వారు: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు


బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘కొబ్బరిమట్ట’ ట్రైలర్ ఇటీవల విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి చూసి పడిపడి నవ్వారని సంపూర్ణేష్ బాబు స్వయంగా తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా పేర్కొన్నారు. ‘కొబ్బరి మట్ట ట్రైలర్ చూసి మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతగానో నవ్వి... మమ్మల్ని, మా కొత్త ఐడియాలను అభినందించారు. ఇది నా జీవితంలో చాలా గొప్పరోజు. ‘కొబ్బరిమట్ట’ చిత్రం నాకు ముఖ్యమైన సినిమా. చిరంజీవి గారి బ్లెస్సింగ్స్ తో ఇక వెనుదిరిగే సమస్యే లేదు. సదా ఆయన ప్రేమకు బానిసను’ అంటూ సంపూర్ణేష్ బాబు పేర్కొన్నాడు. ఈ సందర్భంగా చిరంజీవితో ఆయన కలిసి ఉన్న చిత్రాలను పోస్ట్ చేశాడు.

  • Loading...

More Telugu News