: ఇకపై తెలుగులో కూడా పీఎంఓ వెబ్ సైట్
ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) వెబ్ సైట్ ఇకపై తెలుగులో కూడా అందుబాటులోకి రానుంది. కేవలం తెలుగులోనే కాకుండా మరో ఐదు ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులో ఉంటుందని పీఎంఓ అధికారులు వెల్లడించారు. తెలుగు, తమిళం, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ భాషల్లోని ఆరు వెబ్ సైట్లను కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రధాని మోదీ ఆలోచనల్లో భాగంగానే ఈ వెబ్ సైట్లను ప్రారంభించినట్లు చెప్పారు. మిగతా ప్రాంతీయ భాషల వెబ్ సైట్లను కూడా రూపొందించి, త్వరలోనే వాటిని కూడా ప్రారంభిస్తామని సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. కొత్తగా ప్రారంభించిన ఆయా సైట్ల వివరాలు... తెలుగు - www.pmindia.gov.in/te , తమిళం - www.pmindia.gov.in/ta, మలయాళం - www.pmindia.gov.in/ml, మరాఠీ - www.pmindia.gov.in/mr, బెంగాలీ -www.pmindia.gov.in/bn, గుజరాతీ - www.pmindia.gov.in/gu.