: హైదరాబాద్ లో బిచ్చగాళ్లు లేకుండా చేస్తాం: మేయర్ బొంతు రామ్మోహన్
హైదరాబాద్ లో బిచ్చగాళ్లు లేకుండా చేస్తామని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర బెగ్గర్ ఫ్రీ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ, బిచ్చగాళ్లకు దానం చేయొద్దని, నిజమైన బిచ్చగాళ్లకు పునరావాసం కల్పిస్తామని, బెగ్గర్స్ మాఫియాను అరికడతామని అన్నారు.