: ఉన్నవి అమ్ముకుంటే చాలు... కొత్త ప్రాజెక్టులు ఉండబోవంటున్న డీఎల్ఎఫ్


ఈ సంవత్సరం ఎటువంటి కొత్త రెసిడెన్షియల్, కమర్షియల్ కాంప్లెక్సుల నిర్మాణాలను ప్రారంభించబోవడం లేదని నిర్మాణ రంగ దిగ్గజం డీఎల్ఎఫ్ ప్రకటించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో తాము నిర్మించిన అపార్టుమెంట్లు తదితరాల విక్రయాలపై దృష్టిని సారించనున్నామని, వచ్చే సంవత్సరం మార్చి వరకూ కొత్త శంకుస్థాపనలు ఉండవని సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అశోక్ త్యాగి తెలిపారు. రియల్ ఎస్టేట్ అనలిస్టులతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిన ఆయన "ఢిల్లీ సమీపంలోని గుర్గామ్ లో కొంత మేరకు అమ్మకాలు సాగుతున్నాయి. అయినంతమాత్రాన కొత్త ప్రాజెక్టులను పట్టాలెక్కించే పరిస్థితి లేదు. ఈ ఆర్థిక సంవత్సరం వరకూ ఇప్పటికే వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలను పూర్తి చేసి, విక్రయించే పనిలో ఉంటాం" అన్నారు. దాదాపు రూ. 3 వేల నుంచి రూ. 3,500 కోట్ల విలువైన ఆస్తుల విక్రయాలు జరగాల్సి వుందని ఆయన తెలిపారు. సంస్థ రుణ భారం 12.5 శాతం నుంచి 11.54 శాతం వరకూ తగ్గి వచ్చిందని తెలిపారు. సంస్థ రెంటల్ బిజినెస్ రూ. 18 వేల కోట్లకు చేరగా, రెసిడెన్షియల్ బిజినెస్ రూ. 4,500 కోట్లకు పెరిగిందని తెలిపారు.

  • Loading...

More Telugu News