: కాపులను పట్టించుకోని పవన్ తో ముద్రగడ మంతనాలేంటి?: చినరాజప్ప
కాపుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్ పార్టీ నేతలతోను, కాపులను పట్టించుకోని పవన్ కల్యాణ్ తోను ముద్రగడ పద్మనాభానికి ఉన్న పనేంటని ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రశ్నించారు. హైదరాబాద్ కు వచ్చిన ముద్రగడ పలువురు కాంగ్రెస్ నేతలను కలవడంపై చినరాజప్ప స్పందిస్తూ, ఆయన రోజుకో లేఖను రోజుకో రకంగా ఎందుకు రాస్తున్నారో తెలియడం లేదని అన్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నా పోరాటాలు ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నేతలను కలవడంలో ఆంతర్యం ఏమిటో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా ఎదుగుతున్నారన్న కక్షతోనే నారా లోకేష్ పై వైకాపా నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని చినరాజప్ప మండిపడ్డారు.