: నా తండ్రికి చెడ్డపేరు తీసుకురాను: మహానాడులో లోకేష్ వాగ్దానం


తెలుగుదేశం పార్టీకి, రాష్ట్ర ప్రజలకు నిబద్ధతతో సేవ చేస్తానని, తన తండ్రి చంద్రబాబునాయుడికి చెడ్డపేరు తీసుకువచ్చే పనులు చేయబోనని యువనేత నారా లోకేష్ వాగ్దానం చేశారు. తనపై వైకాపా నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, దమ్ము, ధైర్యం ఉంటే ఒక్క ఆరోపణనైనా నిరూపించాలని సవాల్ విసిరారు. తెలంగాణలో కావాలనే టీడీపీని ఇబ్బంది పెడుతున్నారని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సీట్లు దక్కకపోయినా, టీఆర్ఎస్ తరువాత తెలుగుదేశం పార్టీకే అత్యధిక ఓట్ల శాతం వచ్చిందని గుర్తు చేశారు. టీడీపీ వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. జగన్ మాదిరిగా తన తండ్రి తలదించుకునే పనులు చేయబోనని, ఒక్కసారి అవినీతికి పాల్పడినట్టు రుజువైనా స్వయంగా జైల్లోకి వెళ్లి కూర్చుంటానని చెప్పారు. కుట్ర రాజకీయాల పట్ల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, విపక్షాలు వేసే వలలో చిక్కుకోవద్దని కోరారు.

  • Loading...

More Telugu News