: తాత ఎన్టీఆర్ ను, తండ్రి చంద్రబాబునూ అనుకరిస్తూ మొదలైన లోకేష్ ప్రసంగం


మహానాడు మూడవ రోజు కార్యక్రమాలు ప్రారంభం కాగా, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, యువనేత నారా లోకేష్ ప్రసంగం మొదలైంది. కిక్కిరిసిన కార్యకర్తలను ఉద్దేశించి తన ప్రసంగాన్ని మొదలు పెట్టిన లోకేష్, తన తాత ఎన్టీఆర్ ను, తండ్రి చంద్రబాబునాయుడుల శైలిని అనుకరిస్తూ మాట్లాడారు. "నా తోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ వందనం, పాదాభివందనం. తిరుపతికి, తెలుగుదేశం పార్టీకి ఎక్కడలేని అనుబంధం. ఇదే రోజు... ఇదే రోజు 1982లో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావుగారు, ఇక్కడనే ప్రచారం మొదలు పెట్టి ఆంధ్రరాష్ట్రంలోనే కాదు. యావత్ భారతదేశంలోనే రాజకీయ ప్రభంజనం సృష్టించడం జరిగింది. ఇలాంటి పుణ్యభూమిలో, ఈరోజు మే 29 నాడు నేను మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నా" అని అన్నారు. లోకేష్ ప్రసంగం కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News