: పశ్చిమ గోదావరిలో కాల్పుల కలకలం... భూవివాదంతో సర్పంచ్ పై కాల్పులు!


పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండల పరిధిలోని గొల్లల కోడేరులో ఓ సర్పంచ్ పై కాల్పులు జరిగాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం గొల్లల కోడేరు సర్పంచ్ సూర్యనారాయణరాజుపై రామకృష్ణరాజు అనే వ్యక్తి రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. గ్రామంలోని 25 సెంట్ల భూమిపై నెలకొన్న వివాదం నేపథ్యంలో వీరిరువురి మధ్యా గొడవలు ఉన్నాయి. స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు గ్రామ పంచాయతీ యత్నించగా, దీన్ని వ్యతిరేకించిన రామకృష్ణరాజు అగ్రహంతో తుపాకితో కాల్పులు జరిపాడు. ఈ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న సూర్యనారాయణరాజు పోలీసులకు ఫిర్యాదు చేయగా, రామకృష్ణరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు విచారిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News