: మహానాడులో కార్యకర్తల తాకిడి... గోడ దూకి వెళ్లిన పలాస ఎమ్మెల్యే గౌతు!


పక్కనెవరూ గన్ మెన్లు లేరు. పోలీసులు ఆపేశారు. ముందుకెళ్లే దారి లేదు, వెనక్కు పోలేరు. ఈ పరిస్థితుల్లో పలాస ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్ శివాజీ గోడ దూకారు. ఈ ఘటన తిరుపతిలో మహానాడులో చోటు చేసుకుంది. వేదిక వద్దకు వెళ్లే దారి కనిపించక పోగా, కార్యకర్తల సాయంతో ఓ చిన్న గోడను దూకి వేదిక వద్దకు వెళ్లారు. ఆయన వెళ్లాలనుకున్న దారిలో కార్యకర్తల తాకిడి అధికంగా ఉన్నందునే, ఎమ్మెల్యేను ఆపామని పోలీసులు తెలిపారు. కాగా, మహానాడు రెండవ రోజు పెద్దఎత్తున కార్యకర్తలు తరలిరాగా, వారిని అదుపు చేసి నిర్దేశిత ప్రాంతాలకు పంపడం పోలీసులకు సైతం కష్టతరమైంది.

  • Loading...

More Telugu News