: పవన్ కల్యాణ్ నుంచి ఫోన్ వచ్చింది, గుండె ఆగినట్లయింది: నితిన్
టాలీవుడ్ హీరో నితిన్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఎంత పెద్ద అభిమానో అందరికీ తెలిసిందే. పవన్ పై తన అభిమానాన్ని నితిన్ ఎన్నోసార్లు బహిరంగ వేదికలపై చెప్పుకున్నారు కూడా. అటువంటిది పవన్ కల్యాణ్ సెల్ ఫోన్ నుంచి నితిన్ కు ఫోన్ వచ్చిందట. మొబైల్ రింగ్ అవుతుంటే, దాన్ని తీసుకుని చూసిన తన గుండె ఒక్కక్షణం ఆగిపోయిందని నితిన్ స్వయంగా చెప్పాడు. తన తాజా చిత్రం 'అఆ' విడుదల కానున్న సందర్భంగా, ఓ ఇంటర్వ్యూ ఇస్తూ, ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తొలుత విషయం ఏమై ఉంటుందోనని భయపడ్డానని, తనను కంగారు పెట్టడానికి పవన్ ఫోన్ తీసుకుని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాల్ చేశారని చెప్పాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే త్రివిక్రమ్ గొంతు వినిపించిందని చెప్పాడు.