: ఆహార భద్రతను ఆనాడే తెచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్: బాలయ్య
కేంద్రం ఇప్పుడు ప్రవేశపెడుతున్న ఆహార భద్రతను ఏనాడో అమలు చేసి చూపించిన మహానుభావుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని ఆయన కుమారుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తిరుపతిలో జరుగుతున్న మహానాడులో ఆయన మాట్లాడుతూ, అప్పట్లోనే ఆయన ఎన్నో విప్లవాత్మకమైన పథకాలు చేపట్టారని అన్నారు. ఎన్టీఆర్ మహాదార్శనికుడని ఆయన కొనియాడారు. ఆయన పంచెకట్టి ప్రజాజీవితంలోకి వచ్చారని తెలిపారు. తెలుగువారి దశను, దిశను మార్చిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన చెప్పారు. ఆయన చేసిన సినిమాలు నభూతో నభవిష్యతి అన్న రీతిలో సాగుతాయని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ దారిలోనే టీడీపీ నడుస్తోందని ఆయన తెలిపారు.