: విశాఖ సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మాజీ ప్రధాని దేవెగౌడ


ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాద్రి అప్పన్నను మాజీ ప్రధాని దేవెగౌడ దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు విశాఖ వచ్చిన ఆయన, సింహాచలం దేవస్థానానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను దేవస్థానం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సత్యనారాయణ సాదరంగా ఆహ్వానించారు. వేద పండితుల మత్రోచ్చారణ మధ్య ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నానని అన్నారు. విశాఖ నగరం ఎంతో సుందరమైనదని, సింహగిరి పుణ్యక్షేత్రంలో పచ్చని వాతావరణం తనను ఆకట్టుకుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయనను సత్కరించిన డిప్యూటీ కలెక్టర్‌, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

  • Loading...

More Telugu News