: రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 'ఢీ'


ఐపీఎల్ ఫైనల్స్ రేపు జరగనుంది. ఫైనల్స్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాదుతో తలపడనుండగా పూణే సూపర్ జెయింట్స్ తో ఢీ కోవడం ఎలా అనుకుంటున్నారా?...ఈ ఏడాది అమెరికాలో బీసీసీఐ మినీ ఐపీఎల్ నిర్వహించాలని భావిస్తోంది. అయితే దీనికి ఆదరణ ఎలా ఉంటుందో పెద్దగా తెలియదు. దీంతో ఆదరణను పరీక్షించుకునేందుకు మినీ ఐపీఎల్ కంటే ముందు అమెరికాలో రెయిజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించనుంది. దీనికి వచ్చే ఆదరణను చూసుకుని మినీ ఐపీఎల్ కు ప్లాన్ చేయాలని బీసీసీఐ భావిస్తోంది. జింబాబ్వే, వెస్టిండీస్ లలో టీమిండియా పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ టోర్నీ ముగిసిన తరువాత సెప్టెంబర్ లో దీనిని నిర్వహించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News