: 145 ఏళ్లయినా ఆ చిన్నారి మృతదేహం చెడిపోలేదు... జీవకళ ఉట్టిపడుతోంది!


అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కోలో 145 ఏళ్ల క్రితం సమాధి చేసిన బాలిక మృతదేహం ఇంకా జీవకళ ఉట్టిపడేలా ఉండడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. 30 ఏళ్లపాటు శ్మశాన వాటికగా ఉన్న ఓ ప్రాంతాన్ని నగరవిస్తరణలో భాగంగా 1890లో నిషేధించారు. అంతే కాకుండా, అక్కడ అప్పటికే ఉన్న సమాధులను ఇతర ప్రాంతాలకు తరలించారు. తరువాత ఆ ప్రాంతాన్ని అభివృద్ది చేశారు. ఇప్పుడక్కడ ఇళ్లు వెలిశాయి. అలా వెలిసిన ఓ ఇంటి ఆవరణలోని గార్డెన్‌ ను బాగు చేస్తుండగా వారికి ఓ పెట్టె దొరికింది. అద్దాలతో ఆకర్షణీయంగా ఉండడంతో లోపల ఏముందో చూడాలనే కుతూహలంతో వారు ఆ పెట్టెను శుభ్రం చేశారు. ఆ అద్దాల నుంచి లోపలికి చూసి వారు ఆశ్చర్యపోయారు. ఆ పెట్టలో ఒక పాప చేతిలో రోజా పువ్వు పట్టుకుని ఉంది. ఇంకా బతికే ఉందా? అన్నంతగా ఆమెలో జీవకళ ఉట్టిపడుతున్నట్టు ఉంది. ఆ పాపకు 3 సంవత్సరాలు ఉంటాయని, దీనిని సమాధి చేసి 145 ఏళ్లు అయి ఉంటుందని, అప్పట్లో రసాయనాలతో శరీరం చెక్కుచెదరకుండా భద్రపరిచారని అక్కడి అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News