: విశాల్ చెప్పిన శ్రీదివ్య 'వెయిట్' కథ!
'రాయుడు' సినిమా కోసం తన పక్కన నటించాలని శ్రీదివ్యకు చెప్పినప్పుడు, కాస్త లావవ్వమని కూడా చెప్పానని హీరో విశాల్ తెలిపాడు. 'రాయుడు' సినిమా ప్రమోషన్ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ, తమ జంట బాగుందని అంతా అంటున్నారని అన్నాడు. తమ మధ్య ఎత్తు తేడా ఉన్నప్పటికీ దానిని కెమెరామెన్ కవర్ చేస్తాడని, అయితే హీరోయిన్ కొంచెం బలంగా కనిపించాలని, అందుకే కొంచెం లావు అవ్వాలని కోరానని చెప్పాడు. అయితే తను చెప్పినట్టే శ్రీదివ్య లావు అయిందని, కానీ అప్పటికే సినిమా షూటింగ్ పూర్తయిపోయిందని విశాల్ చమత్కరించాడు. అయినప్పటికీ తమ జంట తెరపై బాగుందని అంతా మెచ్చుకుంటున్నారని చెప్పాడు.