: మా నాన్నకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరగనుంది: ట్విట్టర్ లో పాక్ ప్రధాని నవాజ్ షరిఫ్ కూతురు
మెడికల్ చెకప్ కోసం పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరిఫ్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. ఆయనకు రానున్న మంగళవారం రోజున ఓపెన్ హార్ట్ సర్జరీ జరగనుందని ఆయన కూతురు మర్యాన్ నవాజ్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ‘ప్రధాని నవాజ్ షరీఫ్ మంగళవారం ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోనున్నారు. మందుల కన్నా ప్రార్థనలు ఆయన ఆరోగ్యంపై అధిక ప్రభావం చూపుతాయి. ఆయన కోసం ప్రార్థన చేయండి. ఆయన ఆరోగ్యంగా ఉంటారు’ అంటూ ఆమె ట్వీట్ చేసింది. షరీఫ్ కి పలు టెస్టులు నిర్వహించిన తరువాత డాక్టర్లు గుండె ఆపరేషన్ చేయాలని నిర్ణయించారని ఆమె తెలిపింది.