: వ్యాఖ్యాత అమితాబ్ కాదు...మాధవన్
రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఎన్డీయే ప్రభుత్వం నిర్వహించిన నయీ సుభహ్ కార్యక్రమానికి బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించలేదు. తొలుత ఆ కార్యక్రమాన్ని అమితాబ్ నిర్వహిస్తారని బీజేపీ ప్రకటించగా, దానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో వ్యాఖ్యాతగా ఉండేందుకు అమితాబ్ నిరాకరించారు. బీజేపీ కోరడం వల్ల భేటీ బచావ్, భేటీ పఢావ్ కార్యక్రమానికి మాత్రమే ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా బాలికలు అడిగిన ప్రశ్నలన్నింటికీ స్ఫూర్తివంతమైన సమాధానాలు చెప్పారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా 'తను వెడ్స్ మను', '3 ఇడియట్స్', 'సాలా ఖడూస్' సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆర్.మాధవన్ వ్యవహరించాడు. మాధవన్ కూడా చక్కని వ్యాఖ్యాత కావడం విశేషం.