: రోహిత్ వేముల, అంబేద్కర్ ల ఫోటోల తొలగింపు.. హెచ్‌సీయూలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్ వేముల ఫోటోలను ఒక వర్గం విద్యార్థులు కొన్ని రోజుల క్రితం వర్సిటీలో పెట్టారు. అయితే నిన్న రాత్రి ఆ ఫోటోలను వర్సిటీ సిబ్బంది తొలగించారు. రోహిత్ వేముల ఫోటోలతో పాటు అక్కడి అంబేద్కర్ ఫోటోలను కూడా తీసేశారు. దీంతో విషయాన్ని గమనించిన విద్యార్థులు ఈరోజు ఆందోళనకు దిగారు. వర్సిటీ ప్రధాన గేటు వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. దళిత విద్యార్థుల పట్ల వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీసీ అప్పారావుని పదవినుంచి తొలగించాల్సిందేనని మరోసారి డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.