: కాశ్మీర్లో నివసించని వ్యక్తి కాశ్మీరీ పండిట్ల కోసం పోరాడుతున్నాడు: అనుపమ్ ఖేర్ పై నసీరుద్దీన్ షా సెటైర్


బాలీవుడ్ సీనియర్ నటుల మధ్య రేగిన చిన్న వివాదం క్షమాపణలు డిమాండ్ చేసే వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే...కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన అనంతరం, ఆ పార్టీ ఎంపీగా కిరణ్ ఖేర్ ఎన్నికయిన నాటి నుంచి కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకుని పలు ఆందోళనలు కూడా చేసిన సంగతి తెలిసిందే. ప్రధానంగా కాశ్మీరీ పండిట్లకు సంబంధించిన ట్వీట్లతో ఆమె భర్త అనుపమ్ ఖేర్ హల్ చల్ చేస్తుంటారు. దీనిపై సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఎన్నడూ కాశ్మీర్ లో నివసించని వ్యక్తి కాశ్మీరీ పండిట్ల గురించి పోరాటం చేయడం ఎంత హాస్యాస్పదం? నిజానికి ఆయనే ఓ నిర్వాసితుడైనట్టు వ్యవహరిస్తున్నారు' అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీనికి అనుపమ్ సమాధానమిస్తూ .. 'అంటే షా గారూ, మీ ఉద్దేశంలో ఎన్ఆర్ఐలు భారతదేశం గురించి మాట్లాడవద్దనా?' అంటూ ప్రశ్నించారు. దీనికి దర్శకులు మాధుర్ భండార్కర్, అశోక్ పండిట్ లు ఖేర్ కు మద్దతు పలికారు. అశోక్ పండిట్ ఓ అడుగు ముందుకేసి నసీరుద్దీన్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై షా మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్యలు అనుపమ్ ఖేర్ నుద్దేశించి చేసినవి కాదని, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News