: జైరాం రమేష్, చిదంబరం, కపిల్ సిబాల్ కు రాజ్యసభ సీట్లు ఖరారు


కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థులపై ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మాజీ మంత్రులకు రాజ్యసభ సీట్లను ఖరారు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వారికి కాంగ్రెస్ పార్టీ తరపున సభ్యత్వం కల్పించనున్నారు. మాజీ మంత్రులు కపిల్ సిబాల్, చిదంబరం, జైరాం రమేష్ లను పలు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు పంపనున్నారు. కపిల్ సిబాల్ ను ఉత్తరప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి చిదంబరంను, పంజాబ్ నుంచి అంబీకా సోనీ, కర్ణాటక నుంచి జైరాం రమేష్ ను రాజ్యసభకు పోటీ చేయడానికి ఎంపిక చేశారు.

  • Loading...

More Telugu News