: భార్య నివాసానికి వంద అడుగుల దూరంలో ఉండాలని హాలీవుడ్ హీరోని ఆదేశించిన న్యాయస్ధానం
పైరేట్స్ ఆఫ్ కరేబియన్ సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అలరించిన జానీ డెప్ ను అమెరికా న్యాయస్ధానం భార్య నివాసానికి వంద అడుగుల దూరం వరకు వెళ్లవచ్చని ఆదేశించింది. రహస్యంగా పెళ్లి చేసుకున్న 15 నెలలకే జానీ డెప్ పెళ్లి పెటాకులైంది. 2011లో ద రమ్ డైరీ సినిమాలో నటించిన యాంబర్ హార్ట్ (30)తో మూడేళ్లు రహస్య డేటింగ్ చేసిన జానీ డెప్ (50) 2015 ఫిబ్రవరిలో ఆమెను వివాహం చేసుకున్నాడు. అనంతరం జానీ డెప్ ప్రవర్తనతో విసిగిపోయిన యాంబర్ కోర్టుకెక్కింది. పెళ్లయిన కొద్దికాలానికే తనను హింసించడం మొదలుపెట్టాడని, జుట్టు పట్టుకుని లాగుతూ కొట్టేవాడని కోర్టుకు తెలిపింది. ఆమె సమర్పించిన సాక్ష్యాలను పరిశీలిచిన లాస్ ఏంజిలెస్ సుపీరియర్ కోర్టు యాంబర్ హార్ట్ నివాసానికి వంద అడుగుల దూరంలో ఉండాలని అతనిని ఆదేశించింది. అయితే ఆమె డబ్బు కోసం ఈ ఆరోపణలు చేస్తోందని జానీ డెప్ ఆరోపిస్తున్నాడు.