: మహానాడు వేదికపై మురళీమోహన్ కొత్త డిమాండ్!... కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న టీడీపీ ఎంపీ


తిరుపతిలో జరుగుతున్న టీడీపీ వార్షిక వేడుక మహానాడులో ఆ పార్టీ సీనియర్ నేత, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యుడు మాగంటి మురళీమోహన్ సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం నందమూరి తారకరామారావు పేరును ఆయన సొంత జిల్లా కృష్ణా జిల్లాకు పెట్టాలని మురళీమోహన్ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కొద్దిసేపటి క్రితం ఎన్టీఆర్ ను కీర్తిస్తూ మాట్లాడిన మురళీమోహన్ ఈ డిమాండ్ చేశారు. ఆయన డిమాండుకు వేడుకలకు హాజరైన పార్టీ నేతల నుంచి మంచి మద్దతే లభించింది. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని మురళీమోహన్ అనగానే పార్టీ నేతలు హర్షాతిరేకం వ్యక్తం చేస్తూ మద్దతు పలికారు.

  • Loading...

More Telugu News