: ముందు బెంచీలో కూర్చుని కునుకేసిన బాలయ్య!... కేఈ, చినరాజప్ప, అయ్యన్న కూడా!


తిరుపతిలో నిన్న ఉదయం ప్రారంభమైన టీడీపీ వార్షిక వేడుక మహానాడు వేదికపై ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. నిర్ణీత సమయానికే వేదిక వద్దకు చేరుకున్న టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ... ఇద్దరు డిప్యూటీ సీఎంలు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్పల మధ్యన కూర్చున్నారు. షూటింగ్ ల బిజీ కారణంగానో, ఏమో తెలియదు కాని... వేదికపై ఆసీనుడైన కాసేపట్లోనే బాలయ్య నిద్రలోకి జారుకున్నారు. ఇక బాలయ్యకు ఇరువైపుల ఆసీనులైన కేఈ, చినరాజప్ప కూడా ఆ తర్వాత కునుకేశారు. వీరి వెనకాలే రెండో వరుసలో కూర్చున్న పార్టీ సీనియర్ నేత, ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. దీనిని గమనించిన మీడియా ప్రతినిధులు ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు.

  • Loading...

More Telugu News