: ఈమధ్య ఆయన కనిపించడం లేదు.. ఈరోజు మాత్రం కనిపిస్తారు: రాహుల్ ర్యాలీపై 'ఆప్' వ్యంగ్యాస్త్రాలు
ఢిల్లీలో ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 'ఆప్' ప్రభుత్వాన్ని నిరసిస్తూ ర్యాలీ చేపట్టనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర మంత్రి కపిల్ మిశ్రా రాహుల్ గాంధీపై వ్యంగ్యంగా ట్విట్టర్ లో రీ ట్వీట్ చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు రాహుల్‌గాంధీ ఎన్నో రోజుల నుంచి కనిపించడం లేదని, ఈ ర్యాలీతోనైనా వారు రాహుల్ గాంధీని కలుస్తారని ఆయన ఎద్దేవా చేశారు. కాగా, ఈరోజు సాయంత్రం ఢిల్లీలో రాహుల్ గాంధీ ఆప్ ప్రభుత్వానికి నిరసనగా ర్యాలీ చేపట్టనున్నారు. అక్కడ ప్రజలు ఎదుర్కుంటోన్న విద్యుత్ కోతలు, తాగునీటి సమస్యలు పరిష్కారం చేయాలంటూ కాగడాల ప్రదర్శన చేపట్టనున్నారు. ర్యాలీలో పెద్దఎత్తున ఢిల్లీ కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు.