: అమరావతిలో మరో భారీ విగ్రహం!... 115.5 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రకటించిన చంద్రబాబు
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో మరో భారీ విగ్రహానికి అంకురార్పణ జరిగింది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అమరావతిలో 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా తిరుపతిలో జరుగుతున్న మహానాడు వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కీలక ప్రకటన చేశారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని నలుదిశలా చాటిన ఎన్టీఆర్ కు అమరావతిలో 115.5 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.