: వెయిట్ లాస్ ఆపరేషన్ చేయించుకుంటావా..? ఇంత ఖర్చు చేస్తావా..? అంటూ టీచర్‌కి విడాకులిచ్చిన భర్త
వెయిట్ లాస్ ఆపరేషన్ చేయించుకుంటావా..? ఇంత ఖర్చు చేస్తావా..? అంటూ తన భార్యకు ఓ వ్యక్తి విడాకులిచ్చిన సంఘటన సౌదీ అరేబియాలో జరిగింది. అక్కడి ఓ స్కూల్లో టీచర్ గా పనిచేస్తోన్న సదరు మహిళ కాస్త లావుగా ఉండేది. లావుగా ఉన్నావంటూ తన భర్త చేసే కామెంట్లతో విసుగెత్తిపోయింది. సన్నగా అయి చూపించాలనుకుంది. దాంతో, ఇల్లు కొందామని దాచుకున్న రూ.14లక్షల డబ్బు తీసుకెళ్లి వెయిట్ లాస్ ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వచ్చి, అసలు విషయం భర్తకు చెప్పింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె భర్త విడాకులు ఇచ్చేశాడు. అయితే, ‘చిన్న విషయానికే విడాకులు ఇస్తావా?' అంటూ సదరు భర్త మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలువురు సన్నిహితులు.