: గన్నవరంలో ఎయిరిండియా ఫ్లైట్ టేకాఫ్!... క్షణాల్లోనే ల్యాండింగ్, ప్రయాణికులు సేఫ్!


నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టులో నేటి ఉదయం పెను ప్రమాదమే తప్పింది. 116 మంది ప్రయాణికులతో విజయవాడ నుంచి దేశ రాజధాని ఢిల్లీ బయలుదేరేందుకు టేకాఫ్ తీసుకున్న ఎయిరిండియా విమానం... ఆ తర్వాత క్షణాల్లోనే తిరిగి వెనక్కు వచ్చేసింది. విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ వేగంగా స్పందించడమే కాకుండా విమానాన్ని సురక్షితంగా ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశాడు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News