: పిల్ల కాలువలా ప్రారంభమైన టీడీపీ... 9 నెలల్లో గోదారి వెల్లువైంది!: గోరంట్ల ఆసక్తికర వ్యాఖ్య


తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, దివంగత సీఎం నందమూరి తారకరామారావు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రస్థానానికి సంబంధించి ఆ పార్టీ సీనియర్ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిన్న ఆసక్తికర కామెంట్లు చేశారు. తిరుపతిలో నిన్న ఘనంగా ప్రారంభమైన పార్టీ వార్షిక వేడుక ‘మహానాడు’ వేదికపై పార్టీ ప్రస్థానంపై జరిగిన చర్చలో పాలుపంచుకున్న ఆయన పార్టీ ఆవిర్భావం, ఆ తర్వాత ప్రభంజనంలా ఎదిగిన వైనాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘35 ఏళ్ల క్రితం హైదరాబాదులోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పిల్ల కాలువలా ప్రారంభమైన టీడీపీ 9 నెలలు తిరిగేలోగానే గోదావరి వెల్లువలా మారింది. మూడున్నర దశాబ్దాలు గడిచినా అదే ఒరవడితో ముందుకు సాగుతోంది’’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ నేతలు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

  • Loading...

More Telugu News