: తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పదవికి డీఎస్ రాజీనామా!... మంగళవారం రాజ్యసభకు నామినేషన్
తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త, ఆమధ్య కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి చేరిన ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) కొద్దిసేపటి క్రితం కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న డీఎస్... తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఆయన తన రాజీనామా లేఖను టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అందజేశారు. మంగళవారం డీఎస్ రాజ్యసభ ఎన్నికకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.