: మహానాడు రెండో రోజు వేడుకలు షురూ!... ఎన్టీఆర్ కు చంద్రబాబు, బాలయ్య నివాళి
టీడీపీ వార్షిక వేడుక ‘మహానాడు’ రెండో రోజు వేడుకలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. తిరుపతికి సమీపంలోని తన సొంతూరు నారావారిపల్లెలో రాత్రి బస చేసిన పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లతో పాటు టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలు కొద్దిసేపటి క్రితం ప్రాంగణానికి చేరుకున్నారు. పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని వేదిక మీదే ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, బాలయ్య, పార్టీ నేతలు నివాళి అర్పించారు.