: ఎన్టీఆర్ కు నివాళుల వెల్లువ!... నారావారిపల్లెలో నారా లోకేశ్, ఎన్టీఆర్ ఘాట్ లో దగ్గుబాటి దంపతులు!


టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు వెల్తువెత్తున్నాయి. నేటి ఉదయం ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ, కల్యాణ్ రాం, తారకరత్న, లక్ష్మీపార్వతి హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి వేర్వేరుగా ఆయనకు నివాళి అర్పించారు. తిరుపతిలో నిన్న ప్రారంభమైన మహానాడు కోసం అక్కడికి సమీపంలోని తన సొంతూరులో మకాం వేసిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొద్దిసేపటి క్రితం గ్రామంలోని తన తాత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఇక హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చిన ఎన్టీఆర్ కూతురు, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి తండ్రికి నివాళి అర్పించారు. ఇక మహానాడు వేదిక మీద ఎన్టీఆర్ కు నివాళి అర్పించేందుకు భారీ ఏర్పాట్లు జరిగాయి. మరికాసేపట్లో పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తదితరులు ఎన్టీఆర్ కు నివాళి అర్పించనున్నారు.

  • Loading...

More Telugu News