: ‘మహానాడు’లో రాగి సంగటి, చింతచిగురు వంకాయ కూరల ఘుమఘుమలు!


టీడీపీ వార్షిక వేడుక మహానాడుకు తరలివస్తున్న నేతలు, కార్యకర్తలకు ఆ పార్టీ యంత్రాంగం నోరూరించే రుచులతో కడుపు నింపింది. పార్టీ సీనియర్ నేత, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఎంపీ మాగంటి బాబు స్వీయ పర్యవేక్షణలో వండివార్చిన వంటకాల్లో నిన్న రాయలసీమ స్పెషల్స్ రాగి సంగటి, చింతచిగురు వంకాయ కూరలే సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచాయి. దాదాపు 30 రకాలకు పైగా వంటకాలు సిద్ధం చేసినా, ఈ రెండింటి వద్దే టీడీపీ నేతలు భారీగా బారులు తీరారు. సంగటి, వంకాయకూరల రుచికి మైమరచిపోయిన పార్టీ శ్రేణులు లొట్టలేసుకుంటూ మరీ వాటిని ఆరగించారు.

  • Loading...

More Telugu News