: అమెరికాలో తెలుగు పండుగ ‘నాటా కన్వెన్షన్’ ప్రారంభం!... మూడు రోజుల పాటు వేడుకలు


అమెరికాలో తెలుగు ప్రజల పండుగ ‘నాటా కన్వెన్షన్’ అట్టహాసంగా ప్రారంభమైంది. ‘నార్త్ అట్లాంటిక్ తెలుగు అసోసియేషన్’ పేరిట అక్కడ ఏర్పాటైన తెలుగు ప్రజల సంఘం నాటా... ఏటా కన్వెన్షన్ పేరిట మూడు రోజుల పాటు వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి అమెరికాలోని డల్లాస్ లో ప్రారంభమైన ఈ వేడుకలు ఈ దఫా కూడా మూడు రోజుల పాటు సందడిగా జరగనున్నాయి. ఈ వేడుకలకు టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత ఇప్పటికే అక్కడికి చేరుకుంది. మరో ప్రముఖ నటి హంసానందిని వేడుకల ప్రారంభోత్సవం సందర్భంగా సందడి చేసింది. మూడు రోజుల పాటు నాన్ స్టాప్ గా జరగనున్న ఈ వేడుకల్లో టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖ నటులు హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News