: విశాఖను కమ్మేసిన క్యుములోనింబస్ మేఘాలు.... భారీ వర్షంతో అపార నష్టం
గతేడాది హుదూద్ తుపానుతో అతలాకుతలమైన సాగర నగరం విశాఖను తాజాగా క్యుములోనింబస్ మేఘాలు చుట్టుముట్టాయి. ఫలితంగా నగరంలో భారీ వర్షం కురుస్తోంది. నిన్న రాత్రి కురిసిన వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో అపార నష్టం సంభవించినట్లు సమాచారం. వర్షం, ఈదురు గాలుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరికొన్ని గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.