: మహానాడుకు దూరంగా నందమూరి హరికృష్ణ.... కుటుంబ సభ్యులతో కలిసి తండ్రి ఎన్టీఆర్ కు నివాళి
దివంగత ఎన్టీ రామారావు కుమారుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ నిన్న తిరుపతిలో ప్రారంభమైన పార్టీ వార్షిక వేడుక ‘మహానాడు’లో కనిపించలేదు. ఆ వేడుకలకు దూరంగా ఉన్న హరికృష్ణ నేటి ఉదయం హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ లో ప్రత్యక్షమయ్యారు. తన కొడుకు నందమూరి కల్యాణ్ రాం, సోదరుడి తనయుడు తారకరత్నతో కలిసి అక్కడికి వచ్చిన హరికృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని నివాళి అర్పించారు. పార్టీలో తనకు ప్రాధాన్యం తగ్గిస్తున్నారన్న భావనతో ఉన్న హరికృష్ణ... మహానాడు వేడుకకు హాజరుకాలేదన్న వాదన వినిపిస్తోంది.