: భూ వివాదంలో మాజీ ఎమ్మెల్యే!... వైసీపీ నేతపై కేసు నమోదు, పరారీలో నేత!


ఆపరేషన్ ఆకర్ష్ తో గట్టి పట్టున్న కర్నూలు జిల్లాలో కొడిగడుతున్న దీపంలా ఉన్న విపక్ష వైసీపీకి ఆ జిల్లాలో మరో గట్టి షాక్ తగిలింది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలో చేరిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణపై కర్నూలు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. భూ వివాదానికి సంబంధించి ఓ వ్యక్తిని నిర్బంధించారన్న ఆరోపణలపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు మురళీకృష్ణ సహా 8 మందిపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధమైపోయింది. విషయం తెలుసుకున్న మురళీకృష్ణ పరారయ్యారు.

  • Loading...

More Telugu News