: మెక్ కల్లమ్, దినేష్ కార్తీక్, స్మిత్ అవుట్... 14 ఓవర్లకు గుజరాత్ 100 పరుగులు
ఐపీఎల్ సీజన్ 9లో గుజరాత్ లయన్స్, సన్ రైజర్స్ హైదరాబాదు జట్ల మధ్య మొహాలీ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ బౌలర్లు ఆకట్టుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ లయన్స్ కు ఆదిలోనే ద్వివేదీ (5)ని పెవిలియన్ కు పంపి భువనేశ్వర్ కుమార్ షాకిచ్చాడు. అనంతరం రైనా (1) ను బోల్ట్ అవుట్ చేశాడు. దీంతో జత కలిసిన మెక్ కల్లమ్ (32), దినేష్ కార్తిక్ (26) సన్ రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫోర్, సిక్సర్ తో జోరు పెంచిన కార్తీక్ ను, అనంతరం మెక్ కల్లమ్ ను బిపుల్ శర్మ బోల్తా కొట్టించగా, డ్వెన్ స్మిత్ (1) ను కట్టింగ్ అవుట్ చేశాడు. దీంతో బరిందర్ స్రాన్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన ఫించ్ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. 14 ఓవర్లలో గుజరాత్ లయన్స్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది.