: దీదీకి రాహుల్ శుభాకాంక్షలు


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మమతాబెనర్జీకి కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ మాధ్యమంగా స్పందించిన రాహుల్ గాంధీ, కొత్త కేబినెట్ తో కొలువుదీరిన మమతాబెనర్జీకి శుభాకాంక్షలు తెలుపుతూ, రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలని ఆకాంక్షించారు. కాగా, అధికార పక్షంపై ఉన్న సహజ వ్యతిరేకత కలసి వస్తుందని భావించిన కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న వామపక్షాలను ప్రజలు ఆదరిస్తారని భావించిన వారికి షాక్ నిస్తూ వీరి పొత్తును బెంగాల్ ప్రజలు తిరస్కరించారు.

  • Loading...

More Telugu News