: క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఆరునెలలకే మంత్రి అయ్యాడు!


క్రికెట్ కు గుడ్ బై చెప్పి ఆరు నెలలు కూడా కాకముందే మంత్రి పదవి సాధించిన పశ్చిమ బెంగాల్ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా జాక్ పాట్ కొట్టేశారు. దేశవాళీ క్రికెట్ లో 18 ఏళ్ల పాటు కొనసాగిన లక్ష్మీ రతన్ శుక్లా టీమిండియా తరపున మూడు అంతర్జాతీయ వన్డేలు ఆడారు. ముప్ఫై ఐదు సంవత్సరాల శుక్లా గత డిసెంబర్ లో క్రికెట్ కు గుడ్ బై చెప్పి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)లో చేరారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరహౌరా నియోజకవర్గం నుంచి 27 వేల మెజార్టీతో లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థి పాఠక్ పై గెలుపొందిన శుక్లాకు మంత్రి పదవి దక్కింది. ఎన్నికల్లో పోటీచేసిన మొదటిసారే ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు మంత్రి పదవి కూడా పొందటంపై ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ ఈరోజు ప్రమాణం స్వీకారం చేశారు. మమతతో పాటు 42 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News