: నాకు ప్రతిరోజూ కొత్త రోజే: క్రికెటర్ కోహ్లీ
ప్రతి రోజూ తనకు కొత్త రోజేనని, ప్రతి ఆటలో మెళుకువలు తెలుసుకోవడానికి, ఆట తీరును మెరుగుపరచుకోవడానికి ఆస్కారం ఉంటుందని టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఫైనల్ కు చేరుకున్న నేపథ్యంలో కోహ్లీ మాట్లాడుతూ, తనకు సంబంధించిన తప్పులు, ఒప్పులు రెండింటిపై దృష్టి పెట్టడం ద్వారా తనను తాను మెరుగుపరచుకుంటానని చెప్పాడు. కష్టపడే తత్వం, క్రమశిక్షణకు ఎటువంటి ప్రత్యామ్నాయాలు ఉండవని, వాటికవే సాటి అని కోహ్లీ చెప్పాడు.