: కూలీల కుటుంబాలకు పదిరోజుల్లోగా న్యాయం చేయకపోతే ధర్నా చేస్తాం: వైఎస్ జగన్


గుంటూరు లక్ష్మీపురంలో భవన నిర్మాణ పనులకు పునాది తీస్తుండగా జరిగిన దుర్ఘటనలో మృతి చెందిన కూలీల కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఆ కుటుంబాలకు పది రోజుల్లో కనుక న్యాయం చేయకపోతే కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని జగన్ హెచ్చరించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడులో మృతి చెందిన కూలీల కుటుంబాలను ఆయన పరామర్శించారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ, మృతి చెందిన కూలీల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా, భూమి ఇస్తామని ప్రమాదం సంఘటన అనంతరం ఏపీ సర్కార్ ప్రకటించిందని, అందులో ఏ ఒక్క హామీని ఇంతవరకూ నెరవేర్చలేదని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నేరుగా రూ.5 లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News