: మా వాళ్లకు స్టార్క్ గురించి తెలుసు... అతన్ని అడ్డుకోవడానికి సిద్ధం: సౌతాఫ్రికా కోచ్


ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ను ఎలా అడ్డుకోవాలో తమ ఆటగాళ్లకు బాగా తెలుసని సౌతాఫ్రికా కోచ్ రస్సెల్ డొమిన్ గో తెలిపారు. మిచెల్ స్టార్క్ పూర్వపు ఫాంతో తిరిగి వస్తున్నాడు, సిద్ధంగా ఉండాలన్న అసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వ్యాఖ్యలపై ఆయన మాట్లాడుతూ, మిచెల్ స్టార్క్ వస్తున్నందుకు ఎవరూ భయపడడం లేదని అన్నాడు. గాయం కారణంగా జట్టులో స్థానం కోల్పోయి సుదీర్ఘ కాలం జట్టుకు దూరంగా ఉన్న స్టార్క్ పూర్వపు ఫాం అందుకోవడం కష్టమని చెప్పాడు. స్టార్క్ న్యాణ్యమైన బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదని, కొత్త బంతితో స్వింగ్ రాబట్టగలగడం, స్లాగ్ ఓవర్లలో రివర్స్ స్వింగ్ తో బ్యాట్స్ మన్ ను బెంబేలెత్తించడంలో స్టార్క్ రికార్డు తమకు తెలుసని, అయితే ఆయనకు ఎవరూ భయపడడం లేదని స్పష్టం చేశాడు. కాగా, జూన్ 3 నుంచి 26 వరకు ప్రోటీస్, ఆసీస్, విండీస్ ముక్కోణపు సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News