: టీడీపీ ఆస్తులు 52 కోట్లు... మహానాడులో ప్రకటించిన మంత్రి సిద్దా


తెలుగుదేశం పార్టీ నికర ఆస్తులు 52 కోట్ల రూపాయలని టీడీపీ కోశాధికారి, ఏపీ మంత్రి సిద్ధా రాఘవరావు తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన మహానాడులో ఆయన మాట్లాడుతూ, 2015-16కి సంబంధించిన పార్టీ నికర ఆస్తులు 52 కోట్ల రూపాయలని అన్నారు. పార్టీ సభ్యత్వం, విరాళాల రూపంలో ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు 15 కోట్ల రూపాయలు వచ్చాయని ఆయన తెలిపారు. అందులో 13 కోట్ల రూపాయలు వివిధ కార్యక్రమాలకు ఖర్చు చేశామని అన్నారు. సభ్యత్వం, విరాళాల ద్వారా సమకూరిన మొత్తం 11,13,12,000 రూపాయలని చెప్పిన ఆయన, ఇందులో 8.8 కోట్ల రూపాయలు ఖర్చులయ్యాయని, వాటి వివరాలను సమావేశంలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News