: ఆ కార్యక్రమ వ్యాఖ్యాతను నేను కాదు... అందులో ఓ చిన్న సెగ్మెంట్ నాది: అమితాబ్ బచ్చన్


రెండేళ్ల విజయోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద బీజేపీ నిర్వహించనున్న కార్యక్రమానికి తాను వ్యాఖ్యాతను కాదని బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ స్పష్టం చేశారు. వ్యాఖ్యానం విషయంలో నెలకొన్న వివాదంపై పెదవి విప్పిన సందర్భంగా ఆయన ముంబైలో మాట్లాడుతూ, ఆ కార్యక్రమం మొత్తానికి తాను వ్యాఖ్యాతగా వ్యవహరించడం లేదని అన్నారు. అయితే బేటీ బచావో, బేటీ పఢావో అన్న సెగ్మెంట్ ను మాత్రం తాను నడిపిస్తానని ఆయన చెప్పారు. కాగా, పనామా పేపర్స్ లో అమితాబ్ పేరు వెలుగు చూడడంతో దానిపై వాస్తవాలు వెల్లడికాకుండా ప్రభుత్వ కార్యక్రమానికి అయనను వ్యాఖ్యాతగా ఎలా నియమిస్తారంటూ కాంగ్రెస్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News