: గంగా నదిలో పడవ బోల్తా.. 8 మంది గల్లంతు
గంగా నదిలో పరిమితికి మించి ప్రయాణికులతో వెళుతున్న పడవ బోల్తా పడి ఎనిమిది మంది గల్లంతయ్యారు. బిహార్ లోని కతిహార్ జిల్లా మణిహారి ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ఘటన సమయంలో ఆ పడవలో 28 మంది ఉన్నారు. నది మధ్యలో ప్రయాణిస్తుండగా బోల్తా పడడంతో 20 మంది ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు. మిగతా ఎనిమిది మంది గల్లంతయ్యారు. నది అవతల పొలాల్లో పని చేసేందుకు వీరంతా పడవలో వెళ్లారు. తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. గల్లంతైన వారి కోసం స్థానిక గజ ఈతగాళ్లతోపాటు ఎన్ డీఆర్ ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి.