: ఉప్పల్ స్టేడియం పేరు మారిస్తే తీవ్ర పరిణామాలు: వీహెచ్ హెచ్చరిక


హైదరాబాదులోని ఉప్పల్ లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పేరు మారిస్తే ఊరుకోమని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హెచ్చరించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఉప్పల్ స్టేడియం పేరు మార్పు ఆలోచన విరమించుకోవాలని సూచించారు. రెండేళ్ల మోదీ పాలనలో మాటలే తప్ప చేతలు లేవని ఆయన చెప్పారు. నెహ్రూ కుటుంబంపై బీజేపీ ప్రభుత్వం కక్ష కట్టిందని ఆయన ఆరోపించారు. రాజ్యసభకు పోటీ చేయాలా? వద్దా? అన్న దానిపై రేపటి కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం తరువాత ఓ స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News