: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఈ రోజు కూడా స్టాక్ మార్కెట్లు మంచి ఊపు మీద ఉండడంతో, లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 287 పాయింట్లు లాభపడి 26,654 వద్ద ముగిసింది. నిఫ్టీ 87 పాయింట్లు లాభపడి 8,157 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ లో ఎస్ బీఐ సంస్థ షేర్లు అత్యధికంగా 9.15 శాతం లాభపడి రూ.201 వద్ద ముగిశాయి. వీటితో పాటు బీపీసీఎల్, సన్ ఫార్మా, బ్యాంక్ ఆఫ్ బరోడా, అదానీ పోర్ట్స్ సంస్థల షేర్లు లాభపడ్డాయి. కాగా, ఓఎన్జీసీ సంస్థ షేర్లు అత్యధికంగా 1.60 శాతం నష్టపోయి రూ.212.60 వద్ద ముగిశాయి. ఓఎన్జీసీ సంస్థ షేర్లతో పాటు టాటా పవర్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఇన్ ఫ్రాటెల్ సంస్థల షేర్లు నష్టపోయాయి.